![]() |
![]() |
.webp)
సంజన గల్రాని బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ సారి నామినేషన్స్ లో ఉంటూ చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది మిగతా కంటెస్టెంట్స్ కి అలాగే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆది పినిశెట్టి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. "ఒకసారి ఒక పర్సన్ దగ్గర మోసపోతే సెకండ్ ఛాన్స్ ఇవ్వకూడదు. టాక్సిక్ గా ఉండేవాళ్ళకు దూరంగా ఉండాలి.
గాసిప్స్ కి దూరంగా ఉండాలి. మనం చేసాము అని ఎదుటి వాళ్ళు కూడా చేయాలనీ వాళ్ళనుంచి ఆశించడం తప్పు. కుదిరితే చేయండి లేదంటే లేదు. ఏదైనా ఆ దేవుడికే వదిలేయండి. నేను బాధగా ఉన్నాను అంటే మా ఆయనకు వెంటనే తెలిసిపోతుంది. నా మరిది ఆది పినిశెట్టి నా చెల్లి ఏ కార్యక్రమమైనా వచ్చేస్తారు బెంగళూర్ కి. మా అబ్బాయి అలారిక్ పుట్టినరోజుకు మా చెల్లి ఇంటికి వచ్చింది. మరకతమణి పార్ట్ 2 షూట్ చేస్తున్నారు.
నా చెల్లి నిక్కీ గల్రాని ఈ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని వచ్చింది. కానీ ఆది పినిశెట్టికి మాత్రం డేట్స్ సెట్ కాలేక రాలేకపోయారు. ఆర్టిస్టులందరితో హెవీ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. మా అమ్మ , నాన్న, నా హజ్బెండ్, నా బర్త్ డే , నా పిల్లల బర్త్ డేస్ కి వాళ్ళు బెంగళూర్ వచ్చి అంతా తిరిగేసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. ఆదికి అర్ధం చేసుకునే గుణం ఎక్కువ. మంచి పెర్ఫార్మర్ కూడా. మేమంతా ఫ్యాన్. తనకంటే ఆ క్యారెక్టర్ ఇంకెవరూ బాగా చేయలేరని నిరూపిస్తాడు. షార్ప్ పెర్ఫామెన్స్ ఉంటుంది. ఇక మా కాంబినేషన్ లో మూవీనా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చూడండి" అంటూ చెప్పింది సంజన గల్రాని.
![]() |
![]() |